OLXలో రూమ్ షేరింగ్ కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రకటన...సహజీవనం తరువాత వేశ్య అని తెలియడంతో...
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన విచిత్ర ఘటన ఇది. సహజీవనం పేరుతో ఓ మహిళ తనని మోసం చేసిందని.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ కుమార్ పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..కిరణ్ కుమార్ గత ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.
అద్దె మిగులుతుందనే భావనతో..తనతో రూమ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సంప్రదించలంటూ OLXలో ఓ ప్రకటన ఇచ్చాడు. కిరణ్ కుమార్ ఇచ్చిన ప్రకటనకు ఓ మహిళ ఆసక్తి చూపించింది. ఇద్దరూ కొన్నాళ్లు అదే గదిలో ఉండగా...తరువాత కొంతకాలానికి కూకట్‌పల్లికి మకాం మార్చారు. అయితే కొద్ది రోజులకు ఆ మహిళ తాను ఒక వేశ్యనని చెప్పడంతో కిరణ్ కుమార్ కంగుతిన్నాడు.

దీంతో వెంటనే ఆ మహిళను గది ఖాళీ చేయాలని కోరాడు. దీనికి ఆ మహిళ నిరాకరించడంతో పాటు, గతంలో ఇద్దరు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. అక్కడితో ఆగకుండా కిరణ్ కుమార్ తనపై లైంగికంగా దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ..ఆ మహిళకు 4.7 లక్షల పరిహారం ఇప్పించారు.
పరిహారం తీసుకున్న తరువాత కూడా సదరు మహిళ కిరణ్ కుమార్‌తో దిగిన క్లోజ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో..బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి సమయంలో ఇద్దరి వ్యక్తులతో కిరణ్ కుమార్‌పై దాడి చేయించింది. దీంతో బాధితుడు కిరణ్ కుమార్ మరోసారి ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications