కృష్ణా నదిలో పడి ఈత రాక సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ఈత రాక కృష్ణా నదిలో పడి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన నాగార్జున సాగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని అమీర్ పేట్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశ్వజిత్‌కుమార్(25) తన ఇద్దరు స్నేహితులు రాకేష్, అరవింద్‌లతో కలిసి సోమవారం నాగార్జున సాగర్ అందాలను ఆస్వాదించడానికి ఉదయం అక్కడికి చేరుకున్నారు.
వీరు ద్విచక్రవాహనంపై వచ్చి సాగర్ అందాలను చూస్తూ సాగర్ ప్రధాన డ్యాం, కొత్త బ్రిడ్జి వద్ద సాగర్ అందాలను వీక్షించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ హిల్‌కాలనీ మొసళ్ల జోన్ (బండలపురి) వద్ద వాహనం ఆపి సమీపంలోని నది వద్దకు వెళ్లారు.
నది ఒడ్డున మత్స్యకారులు చేపలు పట్టే పుట్టి ఉండటం గమనించి సమీపంలో ఎవరూ లేకపోవడంతో విశ్వజిత్‌కుమార్ ఒడ్డున ఉన్న చేపల పుట్టిని నదిలోకి లాక్కొచ్చి దానిపై కూర్చున్నాడు. చేపల పుట్టి అటూ ఇటూ గాలికి వెళ్తూ నది మధ్యలోకి వెళ్లడంతో భయంతో అతను నదిలోకి దూకాడు.

ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు గట్టిగా అరుపులు కేకలు వేసినా ఎవరూ రాకపోడవడంతో ఏమీ చేయలేకపోయారు. దీంతో జరిగిన విషయాన్ని స్ధానిక టూరిజం అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్దలానికి చేరుకున్నారు.
స్థానిక మత్స్యకారులను పిలిపించి చేపల పుట్టిలో నదిలోకి వెళ్లి మృతదేహం కోసం గాలించి రెండు గంటల తర్వాత మృతదేహాన్ని గుర్తించి బయటకు తీయించారు పోలీసులు. విశ్వజిత్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రజనీకర్ తెలిపారు. విశ్వజిత్ స్వగ్రామం బీహార్ కావడంతో వారి కుటుంబానికి సమాచారం అందించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications