terrific initiative: హైదరాబాద్‌లో ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్, క్లాత్ బ్యాగ్స్ ఇలా

హైదరాబాద్: ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కూకట్‌పల్లిలోని ఐడీపీఎల్ ప్రాంతంలో శనివారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు ఎనీ టైమ్ బ్యాగ్(ఏటీబీ) మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఐడీపీఎల్‌లోని పండ్ల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఈ మెసిన్‌లో పది రూపాయల నోటు కానీ, కాయిన్ కానీ జారవిడవగానే వస్త్రంతో తయారు చేసిన ఒక క్యారీ బ్యాగ్ బయటికి వస్తుంది.

సుమారు 5 కిలోల బరువును భరించే సామర్థ్యం ఉండేలా ఈ క్యారీ బాగులను తయారు చేశారు. సోలార్ విద్యుత్‌ను వినియోగించుకుని పనిచేసేలా ఈ వెండింగ్ మిషన్‌ను రూపొందించారు. మెవేట్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలు ఈ ఎనీటైమ్ బ్యాంగ్ మిషన్ ప్రాజెక్టును ఆవిష్కరించాయి. మార్కెట్ల నుంచి పండ్లు, కూరగాయలు లేదా కిరాణా సరుకులు తెచ్చుకునేందుకు ఈ క్యారీ బ్యాగులు అనువుగా ఉన్నాయి.

 terrific initiative

ఈ ఏటీబీ మిషన్లను త్వరలో హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సమస్య పరిష్కరించడంతోపాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించడానికి ఈ ఎనీటైమ్ బ్యాగ్ మిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఏటీబీ మిషన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మంత్రి కేటీఆర్ ఈ నూతన ఆవిష్కరణపై స్పందించారు. అద్భుతమైన ఆవిష్కరణ అని ప్రశంసించారు. నెటిజన్లు కూడా మంచి కార్యక్రమం చేపట్టారంటూ అభినందిస్తున్నారు.

 terrific initiative
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+