తెలంగాణ 'మినీ మాల్దీవులు' చూసొద్దామా..? తక్కువ బడ్జెట్‌ లో బెస్ట్ ట్రిప్..!

మాల్దీవులకు వెళ్లాలని చాలామందికి కోరికగా ఉంటుంది. కానీ ఆ ప్రాంతం చాలా దూరం కాబట్టి వెళ్లలేక పోతుంటారు. అయితే మనకు దగ్గరలో తెలంగాణలో మినీ మాల్దీవులుగా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా..? తెలంగాణలోని ఈ పర్యటక ప్రాంతానికి వెళ్తే సేమ్ మాల్దీవులకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. నల్లమల అడవుల్లో దాగిన ఈ అద్భుతమైన ప్రాంతానికి ఎలా చేరుకోవాలి..? తక్కువ బడ్జెట్ లో తెలంగాణ మినీ మాల్దీవుల టూర్ ఎలా చేయాలి..?

చుట్టూ ఎటు చూసినా పచ్చదనంతో స్వాగతం పలుకుతున్న అడవి.. ఆ మధ్యలో ఆధ్యాత్మిక ప్రాంతాలు.. అంతేకాక ఎత్తయిన కొండలు.. వాటి నడుమ అందమైన జలపాతాలు.. ఇలా ప్రకృతి రమణీయమైన ప్రదేశం ఎక్కడో లేదు మన తెలంగాణలోనే దాగి ఉంది. ఈ ప్రాంతం ఇప్పుడు చూపరులను కనువిందు చేస్తోంది. కాస్తంత విరామం దొరికితే.. పర్యాటక ప్రియులు కుటుంబసమేతంగా చూడదగ్గ ప్రదేశంగా మారింది.

అదే తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలువబడే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని 'సోమశిల' ప్రాంతం. ఈ పర్యాటక ప్రదేశం హైదరాబాద్ నుంచి కేవలం 180 కి. మీ. దూరంలోనే ఉంది. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులకు మాల్దీవులకు వెళ్లిన ఫీలింగ్‌ ను కచ్చితంగా కలుగుతుంది. ఇక హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే సోమశిలకు చేరుకోవచ్చు. ఇక్కడి కృష్ణా నదిలో బోటింగ్ కూడా చేసే వీలుంది. అలాగే ఇక్కడి ప్రత్యేకమైన చేపల వంటకాలు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Somasila Mini Maldives of Telangana Somasila s Serene Backwaters Escape in nagarkurnool district

సోమశిల పర్యటనకు వచ్చే పర్యటకులకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తోంది. ఇక్కడే టూరిజం శాఖ ద్వారా బోటింగ్ సదుపాయం కూడా ఉంది. అలాగే టూరిస్టులు తమకు వీలుగా బస చేయటానికి కాటేజీలను నిర్మించారు. ఇక కృష్ణా బ్యాక్‌ వాటర్ ఉండటంతో సోమశిల మాల్దీవుల్లో ఉన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. మరోవైపు సోమశిల నుంచి బోటింగ్ ద్వారా శ్రీశైలానికి చేరుకోవచ్చు. ఇక సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడికి టూరిజం డిపార్ట్ మెంట్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే సొంత వాహనాల్లోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+