తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.!కాంగ్రెస్ ఆధ్వర్యంలో 20రోజుల పాటు ఉత్సవాలన్న వీహెచ్.!
హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2 నుంచి 20 రోజులు పాటు పలు కార్యక్రమాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జూన్ 2 న ప్రతి జిల్లా, మండల స్థాయిలలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించాలని మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు తెలంగాణ ప్రజానికాన్ని కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ, చేస్తున్న మోసాలని ప్రజలకు వివరిస్తామన్నారు వీహెచ్. ఈ 20 రోజులలో జరిగే ప్రతి కార్యక్రమంలో తాను పాల్గొంటానన్నారు వీహెచ్. తెలంగాణ ప్రజలు హస్తం గుర్తు కు ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలని తెలంగాణ ప్రజలకు వీహెచ్ విజ్ఞప్తి చేసారు.

ఇదిలా ఉండగా అమెరికాలో ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అక్కడకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన వారిని భాగస్వాములను చేస్తూ అమెరికాలోని న్యూ జెర్సీ లో జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగరనున్నాయి.
ఈ వేడుకలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీన అమెరికా చేరుకుంటారు. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ కృషి, ప్రస్తుత తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు తదితర అంశాలపై ప్రసంగిస్తారు టీపీసీసీ అధ్యక్షులు. అనంతరం జూన్ 4వ తేదీన న్యూయార్క్ నగరంలో జాకబ్ జావిట్ సెంటర్ లో ఇండియన్ ఓవెర్సెస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దాదాపు 5 వేల మందితో ఒక బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశంలో మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications