హృదయ విదారకరం: కన్న తల్లిని ఇంట్లోకి రానీయని కర్కశులు, మహారాష్ర్ట నుంచి వచ్చిందని..
పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే కాదన్నారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చినందున ఇంట్లోకి రానీయలేదు. పెద్ద కుమారుడు అంతే.. ఇక చిన్న కుమారుడి సంగతి చెప్పక్కర్లేదు. ఎక్కడ తన ఇంటికి వస్తుందోనని తాళం వేసుకొని మరీ వెళ్లాడు. చివరికీ మున్సిపల్ అధికారులు కలుగజేసుకోవడంతో.. దారిలోకి వచ్చారు. కుమారులే ఇంట్లోకి రావొద్దని మాతృమూర్తి అన్న ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది.
Recommended Video
కరీంనగర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్దురాలు మహారాష్ట్ర వెళ్లారు. తిరిగి వద్దామనుకునేలోపు.. లాక్ డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. షోలాపూర్‌లో తన బంధువుల వద్ద ఉన్నారు. నిబంధనలు సడలించడంతో.. శుక్రవారం కరీంనగర్ చేరుకున్నారు. దీంతో సీన్ మొదలైంది. ఆమె చేరుకున్నాక.. ఇంట్లోకి రావొద్దని కుమారులు అంటారు. దీంతో ఏం చేయాలో ఏం చెప్పాల్లో ఆ తల్లికి తెలియలేదు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే రావొద్దని చెప్పడంతో ఏం చేయాలోతోచలేదు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడినుంచి రావడంతో.. ఆమెకు కూడా వైరస్ ఉందా అని కుమారులు భావించారు. కానీ పెద్ద కుమారుడు రావొద్దని చెప్పాడు. చిన్న కుమారుడి వంక చూడగానే అతను ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అయితే తనకేం కాలేదు అని.. బాగానే ఉన్నానని ఆ వృద్దురాలు చెప్పింది. కానీ వారు వినిపించుకోలేదు. చివరికి డివిజన్ మెంబర్ ఏడ్ల అశోక్, మున్సిపల్ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. పెద్ద కుమారుడికి సర్ది చెప్పడంతో.. ఇంట్లోకి రానీచ్చారు. సీనియర్ సిటిజన్లకు కరోనా వైరస్ పరీక్షలు చేస్తారని.. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ చేస్తారని పేర్కొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications