Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌లో సోనూ సూద్ (వీడియో)

ఇటీవల సోషల్ మీడియాలో కుమారి ఆంటీ (Kumari Aunty) బాగా పాపులార్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌లో రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ న‌డుపుతున్న కుమారి ఆంటీ తన వంటకాలతోపాటు మాటలతోనూ ఆకట్టుకున్నారు. 'మీది మొత్తం రూ.1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా' అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనంగా మారారు.

అప్పటి నుంచి సామాన్యులే గాక, యూట్యూబర్లు, సినీ తారలు ఆమె ఫుడ్‌ స్టాల్‌ వద్దకు క్యూ కడుతున్నారు. తాజాగా కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌లో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ (Sonu Sood) సందడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్‌ పక్కన స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతున్న కుమారి ఆంటీ వద్దకు వెళ్లిన సోనూసూద్‌.. అక్కడున్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

Sonu Sood visits kumari aunty s food stall

కుమారి ఆంటీని కలిసి శాలువాతో సత్కరించి బోకే ఇచ్చారు సోనూ సూద్. అనంతరం ఆమెతో సరదాగా మాట్లాడారు. పంచ్‌లు వేస్తూ అక్కడున్న వారిని నవ్వించారు. అంతేగాక, ఆమెకు ఫుడ్‌ సర్వ్‌ చేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు కుమారీ ఆంటీ బెస్ట్‌ ఉదాహరణగా సోనూ సూద్‌ అభివర్ణించారు.

భవిష్యత్తులో ఎలాంటి సాయం అవసరమైన చేస్తానని కుమారి ఆంటీకి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు సోనూ సూద్. అంతేగాక, తన కొత్త సినిమాకు ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ ఆమెను ఆహ్వానించారు. కుమారి ఆంటీ కుటుంబసభ్యులతో ఆయన ఫొటోలు దిగారు. ఫుడ్ ఎంత అని సోనూ సూద్ ఆమెను అడగ్గా.. మీకైతే ఫ్రీ అంటూ నవ్వేశారు.

ఎందుకంటే.. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేశారని, మీకు ఉచితంగా అందజేస్తామని కుమారి ఆంటీ చెప్పారు. మీరు తమ స్టాల్ వద్దకు రావడం ఎంతో సంతోషంగా ఉందని సోనూ సూద్ తో కుమారి ఆంటీ అన్నారు. కాగా, కుమారి ఆంటీని సోనూ సూద్‌ కలిసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+