రిసార్ట్స్‌పై దాడి: అర్ధనగ్నంగా ఉన్న 23 మంది అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శామీర్‌పేటల్‌ని లియోనియా రిసార్ట్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు.

అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారని పోలీసులు వివరించారు. వీరంతా సోమాలియా, మంగోలియాకు చెందిన దేశస్థులుగా గుర్తించామన్నారు.
మద్యం మత్తులో ఉన్న యువతి యువకులు తెల్లవారుజాము వరకు అర్థనగ్న నృత్యాలు చేస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications