తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్..! దీపావళి స్పెషల్ ..!

దీపావళి సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లేలా మొత్తం 10 ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు. అలాగే బెంగళూరు, యశ్వంత్ పూర్, ముజఫరాపూర్, షాలిమార్, చర్లపల్లి నుంచి ఇవి రాకపోకలు సాగించనున్నాయి. ఇవి ఏయే తేదీల్లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం..

రైలు నంబర్ 07225 చర్లపల్లి నుంచి 20వ తేదీ సోమవారం షాలిమార్ కు అందుబాటులో ఉంటుంది. అలాగే
రైలు నంబర్ 07226 షాలిమార్ నుంచి 21వ తేదీ మంగళవారం చర్లపల్లికి అందుబాటులో ఉంచారు. రైలు నంబర్ 06203 బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఇవాళ కలబురగికి అందుబాటులో ఉంచారు. రైలు నంబర్ 06204 కలబురగి నుంచి యశ్వంత్ పూర్ కు రేపు (ఆదివారం) అందుబాటులో ఉంచారు.

south central railway announces diwali special trains via telugu states

రైలు నంబర్ 06207 బెంగళూరు కంటోన్మెంట్ నుంచి కలబురగికి 20వ తేదీ అందుబాటులో ఉంటుంది. రైలు నంబర్ 06208 కలబురగి నుంచి బెంగళూరు కంటోన్మెంట్ కు 21వ తేదీ అందుబాటులో ఉంచారు. రైలు నంబర్ 06209 బెంగళూరు కంటోన్మెంట్ నుంచి కలబురగిరికి 21వ తేదీ అందుబాటులో ఉంటుంది. రైలు నంబర్ 06210 కలబురగి నుంచి యశ్వంత్ పూర్ కు 22వ తేదీ అందుబాటులో ఉంచారు. రైలు నంబర్ 06261 యశ్వంత్ పూర్ నుంచి ముజఫరాపూర్ కు 22వ తేదీ అందుబాటులో ఉంచారు. రైలు నంబర్ 06262 ముజఫరాపూర్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్ కు 24న అందుబాటులో ఉంచారు.

అలాగే రైలు నెం. 07225 / 07226 చర్లపల్లి -షాలిమార్ - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కె రోడ్, సంత్రాగ్‌పూర్, బాలాగపూర్ స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

రైలు నం. 06203 / 06204 బెంగళూరు కాంట్ - కలబురగి - యశ్వంతపూర్ ప్రత్యేక రైళ్లు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షహాబాద్ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. రిటర్న్ లో రైలు నెం. 06204 యశ్వంత్‌పూర్‌లో ఆగిపోతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

రైలు నం. 06207 / 06208 బెంగళూరు కాంట్ - కలబురగి - బెంగళూరు కాంట్ ప్రత్యేక రైళ్లకు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షహాబాద్ స్టేషన్లలో రెండు వైపులా స్టాప్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. రైలు నం. 06209 / 06210 బెంగళూరు కాంట్ - కలబురగి - బెంగళూరు కాంట్ ప్రత్యేక రైళ్లకు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షహాబాద్ స్టేషన్లలో రెండు వైపులా స్టాప్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

south central railway announces diwali special trains via telugu states

రైలు నం. 06261 / 06262 యశ్వంత్‌పూర్ - ముజఫర్‌పూర్ - బెంగళూరు కాంట్ ప్రత్యేక రైళ్లకు యలహంక, ధర్మవరం, అనంతపురం, ధోనే, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట, రామగుండం, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, సత్నా, ప్రయాగ్‌రాజ్ ఛోకి, పీటీ, డీడీ ఉపాధ్యాయ, బక్సర్, ఔరా, దానాపూర్, పాతాపూర్, పాతాపూర్, రెండు స్టేషన్‌లలో స్టాప్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+