వందేభారత్, రాజధాని, బెంగళూరు ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం, ఇక నుంచి..!!
హైదరాబాద్ నుంచి వందేభారత్ సహా పలు ప్రధాన రైళ్ల రాకపోకలు సాగించే ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్. రైల్వే - రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కొన్ని ప్రధాన రైళ్ల రాకపోకలను ఇతర స్టేషన్లకు మార్పు చేసాయి. ఇదే సమయంలో ఉదయం వేళల్లో నగరంలోని స్టేషన్లకు వచ్చే రైళ్లు.. బయల్దేరే రైళ్లల్లో పెద్ద ఎత్తున ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వీరి కోసం ఈ తాజా నిర్ణయం తో ప్రయోజనం కలగనుంది.
హైదరాబాద్ పరిధిలోని పలు ప్రధాన స్టేషన్లలో ఉదయం 5-6 గంటల మధ్య పలు ప్రధాన రైళ్లు బయల్దేరుతాయి. అదే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఈ స్టేషన్లకు చేరుకుంటాయి. దీంతో, వందేభారత్.. రాజధాని.. బెంగళూరు, విశాఖ కు రాకపోకలు సాగించే వారి కోసం ఉదయం 5 గంటల నుంచే మెట్రో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ తెలంగాణ సీఎస్ రామకృష్ణరావును కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రోజే అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని.. ఇలా వచ్చే రైళ్లన్ని ఉదయం 4-5 గంటల మధ్యలోనే హైదారాబాద్‌లోని కీలక స్టేషన్‌లైన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్ చేరుకుంటున్నాయని తెలిపారు. అదే విధంగాహైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే వందేభారత్ సమా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లు సైతం అదే సమయంలో బయల్దేరు తున్నాయని వివరించారు.

ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు
ఈ సమయంలో మెట్రో సేవలు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సీఎస్ కు వివరించారు. అంతేకాదు ప్రస్తుతం నాగోల్, మియాపూర్, ఎల్‌బీనగర్ వంటి స్టేషన్‌ల నుంచి ఉదయం 6 గంటలకే మెట్రోలు స్టార్ట్ అవుతున్నా.. అవి నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్‌లకు చేరుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో ఈ మెట్రోలు స్టేషన్‌లను చేరుకునేందుకు సుమారు 6:30-6:45 అవుతుందన్నారు. ఇదే విషయంపై గతంలోనూ మెట్రోరైలు లిమిటెడ్ ఎండీకి లేఖ రాశామని కానీ అప్పుడు సాంకేతిక అంశాలు, నిర్వహణ కారణాల నేపథ్యంలో మెట్రో సమయంలో మార్పులు చేయలేమని ఎల్‌అండ్‌టీ-హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తెలిపినట్టు చెప్పారు. రైల్వే జీఎం విజ్ఞప్తిపై తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆయన హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులకు సూచించారు. దీంతో.. మెట్రో త్వరలో ప్రభుత్వం చేతికి వచ్చే విధంగా ప్రయత్నాలు సాగుతున్న సమయంలో.. ఈ ప్రతిపాదన త్వరలో అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications