చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు- రూట్, టైమింగ్స్
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో చర్లపల్లి- తిరుచిరాపల్లి మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. 'రైల్ ఆన్ డిమాండ్' పద్ధతిలో నడిచే ఈ రైళ్ల వివరాలను వెల్లడించింది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. తొలి రైలు ఫిబ్రవరి 3వ తేదీన పట్టాలెక్కనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆరంభమైంది. ఈ నెల చివరి వారం వరకూ ఇవి ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి.
ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో మంగళవారం నాడు చర్లపల్లి నుండి సాయంత్రం 5:50 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07615 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 6:45 నిమిషాలకు తిరుచిరాపల్లికి చేరుకుంటుంది.

ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో బుధవారం నాడు తిరుచిరాపల్లి నుండి రాత్రి 9:30 గంటలకు బయలుదేరే నంబర్ 07616 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
నల్గొండ (19:19/19:20, మిర్యాలగూడ (19:49/19:50), నడికుడి (20:29/20:30), సత్తెనపల్లి (21:49/21:50), గుంటూరు (23:10/23:20), తెనాలి (1:08/1:10), బాపట్ల (1:50/1:52), చీరాల (2:08/2:10), ఒంగోలు, నెల్లూరు (05:03/05:05), గూడూరు (06:53/06:55), రేణిగుంట (8:10/8:20), తిరుపతి (09:00/09:05), పాకల, చిత్తూరు (10:13/10:15) స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది.
అలాగే- కాట్పాడి (11:40/11:45) వెల్లూరు (12:03/12:05, తిరువణ్ణామలై (13:20/13:22), తిరుక్కోవిలూర్ (13:52/13:54), విలుప్పురం, విరుధాచలం (15:10/15:12), అరియలూరు (15:46/15:48), శ్రీరంగం (16:30/16:32) మీదుగా తిరుచిరాపల్లికి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్ల కోచ్ కూర్పులో ఒక ఫస్ట్ క్లాస్ కమ్ ఏసీ టూ టైర్ బోగీ ఉంటుంది. అలాగే మూడు ఏసీ టూ టైర్ కోచ్‌లతో పాటు రెండు ఏసీ త్రీ టైర్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల కోసం 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కేటాయించారు. అదనంగా రెండు లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్‌లు కూడా ఏర్పాటు చేశార.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications