శ్రీశైలం, సాగర్ జలాశయాలలో ఉప్పొంగిన కృష్ణమ్మ.. వారికి తీవ్రహెచ్చరిక!!
భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద దెబ్బకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో జలకళ తొణికిసలాడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీవరద నేపథ్యంలో ప్రాజెక్టు పదిగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. నిన్న ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మూడు గేట్లద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు ఆ తర్వాత మరో రెండు గేట్లను ఎత్తి నీటిని వదిలారు.
శ్రీశైలంలో కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో మొత్తం పది గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 2, 86,598 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇక అవుట్ ఫ్లో 337,312 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 884.20 అడుగుల నీరు ఉంది.

శ్రీశైలం 10 గేట్లు ఎత్తిన అధికారులు.. జనాల సందడి
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.9946 టిఎంసిలుగా నీరు ఉంది. కాగా శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు .ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద 10 గేట్లు ఎత్తటంతో జనాలు శ్రీశైలంలో కృష్ణమ్మ అందాలు చూసేందుకు భారీగా వెళ్తున్నారు. దీంతో శ్రీశైలం వద్ద సందడి కొనసాగుతుంది.
నాగార్జున సాగర్ కు వరద ఉధృతి
ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి.. నిన్నటితో పోల్చుకుంటే శ్రీశైలం కు కొంత ఇంఫ్లో తగ్గినప్పటికీ దాదాపు 3లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 884.3అడుగులకు చేరింది... దీంతో జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ప్రాజెక్టు 10క్రస్టు గేట్లు 10ఫీట్ల మేర ఎత్తడం ద్వారా మొత్తంగా 3లక్షల 33వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు..
కృష్ణా లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలెర్ట్
దీంతో ప్రస్తుతం సాగర్ 524.30అడుగులకు చేరింది... సాగర్ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 5944క్యూసెక్కుల, SLBC ద్వారా హైదారాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం మరో 800క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు... వరద ఉధృతి కారణంగా కృష్ణా లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు సాగర్ వెనుక జలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications