Street Dogs Attack: జగిత్యాల జిల్లా కేంద్రంలో కుక్కల దాడులు.. 15 మంది పిల్లలకు గాయాలు..!
రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. ఇప్పటికే కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు. బాలుడిపై కుక్కలు దాడి చేసే వీడియో సోషల్ మీడియాల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటమ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటనీతండాలో భరత్ అనే ఐదేళ్ల బాలుడిపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు విడిచాడు. కొద్ది రోజుల క్రితం కాజీపేటలో ఓ బాలుడిని వీధి కుక్కలు కరిచి చంపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చోటూ బహిర్భూమి కోసం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆరు వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు.

ఆ తర్వాత హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఓ టౌన్‌షిప్‌లో ఐదు కుక్కలు మూడేళ్ల బాలుడిపై దాడి చేశాయి. వెంటనే గమనించిన చుట్టుపక్కల వారు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడు ట్యూషన్ నుంచి ఇంటికి విస్తుండగా కుక్కలు దాడి చేశాయి. వీధి కుక్కలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామంలో వీధి కుక్క ఓ బాలుణ్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుణ్ని కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాజాగా జగిత్యాల జిల్లాలో వీధి కుక్కలు ప్రజలు దాడి చేశాయి. జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో 10 రోజుల వ్యవధిలో 15 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. కుక్కలు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పంధించి కుక్కలను పట్టుకోవాలని కోరుతున్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications