ఢిల్లీ ఆందోళనల తీవ్రత చార్మినార్ వద్ద ప్రతిధ్వనించింది.. !!

ఢిల్లీలో విద్యార్థులపై ఇటీవల జరిగిన పోలీసుల లాఠీఛార్జీ ప్రభావం హైదరాబాద్‌లో కనిపించింది. చారిత్రక చార్మినార్ వద్ద నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ఇచ్చిన పిలుపు మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన తర్వాత చార్మినార్ పరిసరాల్లో భారీ ప్రదర్శన చేపట్టారు విద్యార్థులు. తమ హక్కుల కోసం రాజీలేని పోరాటం సాగిస్తున్న తోటి విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలు, ఆందోళనను నిర్వహించారు.

మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఇస్లామిక్ విద్యార్థులు చార్మినార్ వద్ద గుమికూడారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసుల వైఖరిని నిరసించారు. వందలాది మంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ ఆందోళనలకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా వారి నినాదాలతో చార్మినార్ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఢిల్లీ పోలీసుల ఏకపక్ష వైఖరి, విద్యార్థులపై జరిపిన లాఠీఛార్జ్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

Students Islamic Organisation Stages Hyderabad Demonstration After Friday Prayers Delhi Protest

ఉన్నత విద్యాసంస్థల్లో జరుగుతున్న కుట్రలను తక్షణమే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు తమ పరిధిని దాటి వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసనను శాంతియుతంగా తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని వారు స్పష్టం చేశారు. విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సంఘీభావ ప్రదర్శన ఏ ఒక్క ప్రాంతానికో లేదా ఏ ఒక్క రోజుకో పరిమితమైనది కాదని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థల్లో నెలకొన్న వివిధ అణచివేత ధోరణులపై, భవిష్యత్తులో మరింత బలమైన పోరాటాలు సాగిస్తామని వారు ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, ప్రశ్నించే హక్కును కాపాడుకుంటామని, బాధ్యులకు తగిన శిక్ష పడే వరకు శాంతియుత మార్గంలో తమ ఆందోళనలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్ నగర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+