భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్: షాకిచ్చిన మొగుడు, చివరికిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తమ మధ్య అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ఓ వివాహిత చేసిన ప్లాన్ బెడిసికొట్టింది. భార్య, ప్రియుడి నుండి తప్పించుకొని భర్త నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ వేసిన పథకం బెడిసికొట్టింది. నారాయణగూడకు చెందిన జ్ఞానేశ్వర్‌, సునీత దంపతులు.

Sunitha arrested for plans to murder husband

సునీత ఇటీవల శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. తమ వివాహేతర సంబంధానికి జ్ఞానేశ్వర్‌ అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత ప్రియుడు శ్రీనివాస్‌తో కలిసి జ్ఞానేశ్వర్‌‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన జ్ఞానేశ్వర్‌కు నిద్రమాత్రలిచ్చి హత్యకు యత్నించారు.

ఎలాగోలా వారినుంచి తప్పించుకున్న జ్ఞానేశ్వర్‌ నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సునీతను, ఆమె ప్రియుడు శ్రీనివాస్‌తో పాటు వారికి సహకరించిన ఆటో డ్రైవర్ వెంకటేష్ అరెస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunitha tried to murder her husband Jnaneshwar for illegal affair.Sunitha married Jnaneshwar Two years back.She is continuing illegal affair with Srinivas few months.Sunitha planned to murder Jnaneshwar,But He was safely escaped.Police arrested Sunitha and srinivas.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి