సూపర్‌స్టార్ కృష్ణ నూతన ఆవిష్కరణలకు దార్శనికుడు: ఎంకే స్టాలిన్, పవన్ కళ్యాణ్, కేటీఆర్ సంతాపం!!
సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు కన్నుమూశారు . పార్టీ అరెస్టుకు గురైన ఆయన చికిత్స పొందుతూ కాంటినెంటల్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ పరిశ్రమ వర్గాలనే కాకుండా, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
కృష్ణ గారి మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు: ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడం బాధాకరమని, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ తెలుగు నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు ఆయన, తెలుగు చిత్రసీమలో ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికిన దార్శనికుడు కృష్ణ అని కొనియాడారు. ఆయన మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని, తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మహేష్ బాబు అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

చిత్రసీమలో సూపర్ స్టార్ అన్న బిరుదుకి సార్ధకత చేకూర్చిన కృష్ణ : పవన్ కళ్యాణ్
సూపర్ స్టార్ కృష్ణ వృత్తిపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్రసీమలో సూపర్ స్టార్ అన్న బిరుదుకి సార్ధకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారని విషయం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన తరువాత కోలుకుంటారని ఆశించానని, కానీ ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అన్నారు. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండే వారిని, మద్రాసులో ఉన్నప్పటి నుంచీ మా కుటుంబంతో ఆయనకు చక్కని అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ : పవన్ కళ్యాణ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేత కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారని గుర్తు చేశారు. చిన్న పాత్రలు పోషించిన కృష్ణ గారు జేమ్స్ బాండ్, కౌ బాయ్ వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేసుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమారంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణ గారి మరణం తెలుగు చలన చిత్రసీమకు తీరని లోటని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన కుమారుడు మహేష్ బాబు గారికి సభ్యులకు నా తరఫున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్.
కృష్ణ గారి మరణం అనే భయంకరమైన వార్తతో మేల్కొన్నాను: కేటీఆర్
సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించారనే భయంకరమైన వార్తతో మేల్కొన్నాను. నిజంగా లెజెండరీ యాక్టర్ అని, ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యంత వినయపూర్వకమైన తారలలో ఒకరు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నా ప్రియ మిత్రుడు మహేష్ బాబుకు హృదయపూర్వక సానుభూతి అని పేర్కొన్నారు.
ఈ దుఃఖపు కాలంలో రెండు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం బాధాకరం అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications