గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం కీలక ఆదేశాలు..!!

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో, తెలంగాణ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

ప్రభుత్వానికి ఊరట
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బుధవారం సుప్రీంకోర్టు ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్దించారు. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది.

Supreme Court issues stay order on TG high court orders over MLC s appointement

ప్రభుత్వ విధి
ఎమ్మెల్సీలను ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడమన్నది ప్రభుత్వ విధి అని పేర్కొంది. గత ప్రభుత్వం నియమించిన తమను కాదని కొత్త ప్రభుత్వం ఎమ్మెల్సీలను నియామకం చేపట్టడంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని నిలుపుదల చేయాలని పిటీషన్ లో కోరారు. కొత్త ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వం, గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాలపై స్టే
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ నియామకాలను గవర్నర్ పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ఆమోదం తెలిపారు. వీరిద్దరి నియామకంలో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ నియామక గెజిట్ కొట్టివేస్తూ.. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టు స్టే విధిస్తూ నిర్ణయం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+