గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు వెల్లడించకపోవడం తప్పేనని కృష్ణమోహన్ రెడ్డి న్యాయవాది అంగీకరించారు. కానీ, అవి డిపాజిట్లు కాదని, సేవింగ్స్ అకౌంట్స్ కావడం వల్లనే వెల్లడించలేదని చెప్పారు. అవి కూడా కృష్ణమోహన్ రెడ్డి భార్య పేరు మీద ఉన్నాయని తెలిపారు.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెందిన స్థలాన్ని గతంలోనే విక్రయించినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలు కోర్టుకు అందజేశారు. అనంతరం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం సెప్టెంబర్ 24న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులిచ్చింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు... తదుపరి విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది.
కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రత్యర్థి డీకే అరుణ ఎమ్మెల్యే బండ్లపై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ వాదనల తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణమోహన్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications