• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రజామోదం ఉంటేనే టిక్కెట్, ఈసారి సిట్టింగ్ లకు తిప్పలే, విజయం దిశగా టీఆర్ఎస్ వ్యూహరచన!

By Ramesh Babu
|

హైదరాబాద్: నియోజకవర్గ ప్రజలు వద్దంటే ఆయా ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే ఆలోచనలో టీఆర్ఎస్ కనిపిస్తోంది. విజయం దక్కాలంటే జనం మాటే పార్టీ పాటగా ముందుకెళ్లాలన్న యోచనతో అడుగులేస్తోంది. ఈ ప్రాతిపదికన దాదాపు 20 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఆరు నెలలకు ఓసారి తెలంగాణలో నిర్వహిస్తున్న సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజకవర్గంలో ప్రజలు సీఎం పనితీరుకు, పార్టీకి అనుకూలంగా స్పందిస్తున్నా, ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత చూపుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఈసారి మార్పు తప్పదని తెలుస్తోంది.

తొలిసారి తక్కువే.. అయినా..

తొలిసారి తక్కువే.. అయినా..

గత శాసనసభ ఎన్నికల్లో తెరాస తొలుత 63 స్థానాల్లో విజయం సాధించింది. తరువాత బీఎస్పీ సభ్యులు ఇద్దరు విలీనమయ్యారు. ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు, 12 మంది టీడీపీ సభ్యులు టీఆర్ఎస్ లో విలీనమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు చేరారు. ఈసారి రైతుల్లో, కుల వృత్తుల వారిలో, ఉద్యోగులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న వారి మద్దతు పార్టీకి ఉంటుందని, వీటితో పార్టీ విజయం సాధిస్తుందనే ధీమా అధికార పార్టీలో ఉంది.

ఈసారి మెజారిటీ తథ్యం...

ఈసారి మెజారిటీ తథ్యం...

పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో 106 నుంచి 111 నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించనున్నట్లు తేలింది. అయితే అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశాన్ని గత సమావేశంలోనే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడినప్పుడూ కూడా ఆయన ఈ అంశాన్ని వారికి వివరించారు.

అదే పాచిక ఇప్పుడు కూడా...

అదే పాచిక ఇప్పుడు కూడా...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సిఫారసులను పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే విధంగా శాసనసభ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో వ్యక్తమైన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పనితీరే ప్రాతిపదిక...

పనితీరే ప్రాతిపదిక...

అయితే ఇతర పార్టీల నుంచి చేరిన వారిలో కొందరి పట్ల, టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో కొందరి పట్ల సర్వేలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ శాసనసభ్యులకు సూచనప్రాయంగా వెల్లడించారు. మీలో కొందరు పనితీరు మెరుగు పరుచుకోవాలి. సర్వేలో అనుకూలత వ్యక్తమైతేనే మళ్లీ అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

వాళ్లు ఇటు, వీళ్లు అటు...

వాళ్లు ఇటు, వీళ్లు అటు...

అలాగే ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించనున్నారు. ఒకరిద్దరు ఎంపీలను శాసనసభకు పంపించే ఆలోచనలో కూడా పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

సీట్లు పెరిగినా.. మార్పులు తప్పవు

సీట్లు పెరిగినా.. మార్పులు తప్పవు

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నెలరోజుల్లో ప్రారంభమవుతుందనే అంచనాలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అయితే నియోజకవర్గాల సంఖ్య పెరిగినా, పెరగకపోయినా.. కొంతమంది ఎమ్మెల్యేలను అయితే మార్చాలనే ఆలోచన మాత్రం పార్టీ నాయకత్వానికి బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Telangana State some of the sitting MLAs are in danger position now. The Survey conducted for every six months by TRS party regarding MLAs performance.. are giving bad results about some MLAs. Even though people of telangana like TRS party and CM KCR, in some constituencies.. people are not liking MLAs.. This is the result from the surveys. So TRS Chief CM KCR also thinking to change 20-30 sitting MLAs in coming Assembly Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more