ఐఐటీ గువాహటిలో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్/గౌహతి: అసోంలోని ఐఐటీ-గువాహటి (IIT Guwahati)లో ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గౌహతి నగరంలోని పల్టన్ బజార్‌లోని సిటీ ప్యాలెస్ హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఈ విషయాన్ని ఐఐటీ గువాహటి ధృవీకరించింది.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఈసీఈ చదువుతున్న ఐశ్వర్యతోపాటు ఆమె ముగ్గురు స్నేహితులు ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్‌లో రెండు గదులను బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి జీఎస్ రోడ్‌లోని బార్‌లో న్యూ ఇయర్ పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. ఆ తర్వాత సదరు విద్యార్థిని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హోటల్‌కు చేరుకుంది.

 suspicious death of a telangana student iit-guwahati

కాగా, జనవరి 1వ తేదీన ఉదయం తనతోపాటు గదిలో ఉన్న మరో స్నేహితురాలు వాష్ రూంకు వెళ్లగా అక్కడ ఐశ్వర్య అచేతనావస్థలో ఉండటాన్ని గుర్తించారు. ఆ వెంటనే హోటల్ సిబ్బంది ఆమెను గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ సిబ్బందిని, ఐశ్వర్య స్నేహితులను విచారించారు. కాగా, డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి హోటల్ తనిఖీలో భాగంగా వెళ్లినప్పుడు ఐశ్వర్యతోపాటు ఇతర స్నేహితులు మత్తులో ఉన్నట్లు సిబ్బంది చెప్పారని పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్ పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో వీరంతా బాగా మద్యం సేవించి హోటల్‌కు వచ్చారని పేర్కొన్నారు.

అయితే, యువతి అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. ఐశ్వర్య మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ఐఐటీ గువాహటి యాజమాన్యం సమాచారం అందించారు. ఐశ్వర్య మృతి చాలా బాధాకరమని, ఈ ఘటనకు సంబంధించి తగిన విచారణ చేపట్టాలని పోలీసులను కోరినట్లు ఐఐటీ యాజమాన్యం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+