నేడు కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకారోత్సవం..!
తెలంగాణ లోని గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. గ్రామ పంచాయతీల గడువు ముగిసి రెండేళ్లు దాటినా.. పలు కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఇన్నాళ్లూ పల్లెల్లో పాలనను ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఇప్పుడు రీసెంట్ గానే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ జరపడం.. ఫలితాలు వెలువడటం చకచకా జరిగిపోయాయి. 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. కాగా నేడు నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈరోజు ( డిసెంబర్ 22, 2025, సోమవారం ) ఉదయం 10:30 గంటలకు 12,702 గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. ముందుగా వార్డు సభ్యులు.. ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

అయితే ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే నూతన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మం) చింతల్ ఠాణ గ్రామం వ్యవహారం కూడా చర్చకు తెర లేపింది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచుగా చనిపోయిన వ్యక్తి చెర్ల మురళి గెలుపొందారు. ఫలితాలు వెల్లడించిన రోజునే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని నివేదిక ద్వారా పంపించారు. కానీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు చింతల్ ఠాణాలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉప సర్పంచికి తాత్కాలికంగా సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తారా? లేక మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications