సింగరేణి కార్మికులకు తీపి కబురు ... దీపావళి బోనస్ భారీగా ప్రకటించిన యాజమాన్యం
Recommended Video
సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా ప్రతి ఏడాది బోనస్ ఇస్తున్న సింగరేణి యాజమాన్యం ఈ ఏడాది దీపావళికి ముందే కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు గతంలో ఇచ్చిన బోనస్ కంటే ఎక్కువగా భారీ బోనస్ ను కార్మికులకు అందించనుంది.
సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సింగరేణి యాజమాన్యం ఈసారి ఇవ్వబోతున్న బోనస్ ఎంత అంటే.. గతేడాది సింగరేణి యాజమాన్యం కార్మికులకు 60, 500 రూపాయల చొప్పున బోనస్ గా చెల్లించింది. ఇక ఈ సారి మరింత ఎక్కువగా బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈసారి ఒక్కో కార్మికుడికి 64,700 రూపాయలను బోనస్ గా చెల్లించనున్నట్లు తెలిపింది. ఇక ఈ బోనస్ ను 25 వ తేదీన కార్మికులకు అందించనుంది.

సింగరేణి లో పనిచేస్తున్న దాదాపు 48 వేల మందికి పైగా కార్మికులు యాజమాన్యం అందిస్తున్న ప్రతిభ ఆధారిత ప్రయోజనంగా పి ఎల్ ఆర్ బోనస్ ను అందుకోనున్నారు. దీంతో సింగరేణి కార్మికులు తమ కుటుంబాలతో పండుగ జరుపుకునేలా యాజమాన్యం బోనస్ ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. యాజమాన్యం దీపావళి పండుగ సందర్భంగా తమ జీవితాల్లో నిజంగానే వెలుగులు నింపింది అని, కుటుంబ సభ్యులతో కలిసి పండగను సంతోషంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications