స్వైన్‌ఫ్లూతో స్త్రీ మృతి: నగరంలో మాస్కులతో(పిక్చర్స్)
హైదరాబాద్: స్వైన్ ఫ్లూతో హైదరాబాద్ నగరాన్ని భయపెడుతోంది. రెండు రోజుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు తెలంగాణలో నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఈ నెలలో సోమవారం నాటికి ఏడు స్వైన్ ఫ్లూ మరణాలు నమోదయ్యాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మంగళవారం చనిపోయారు.
దీంతో ఈ నెలలో ఇప్పటికి పదకొండు మంది స్వైన్‌ఫ్లూతో మృతి చెందినట్టయింది. మంగళవారం చనిపోయినవారిలో ఒకరు మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్‌కు చెందిన 38 సంవత్సరాల వ్యక్తి. ఈ నెల 13న స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఉస్మానియాకు వచ్చారు. వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయగా హెచ్1ఎన్1 వైరస్ సోకిందని తేలడంతో చికిత్స చేస్తున్నప్పటికీ పరిస్థితి విషమించి మంగళవారం చనిపోయారు.
మరొకరు ఆసిఫ్ నగర్‌కు చెందిన 40 సంవత్సరాల గృహిణి. ఆమె సోమవారమే ఉస్మానియాలో చేరారు. మంగళవారం చనిపోయారు. ఇక, గాంధీ ఆస్పత్రిలో జీడిమెట్లకు చెందిన 36 సంవత్సరాల మహిళ, శాంతి నగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి మంగళవారం మృతి చెందారు.

స్వైన్ ఫ్లూ
స్వైన్‌ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. తుమ్ము, దగ్గు స్రావాల ద్వారా ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

స్వైన్ ఫ్లూ
హెచ్1ఎన్1 వైరస్ సోకినవారికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు చేసి ముక్కు కారిపోవడం వంటి లక్షణాలు కనపడతాయి.

స్వైన్ ఫ్లూ
ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వణుకు, అలసట బాధిస్తాయి. చాలామందికి వాంతులు, విరేచనాల వంటివి కూడా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనపడిన 36 గంటల్లో టామిఫ్లు, రెలెంజా వంటి యాంటీవైరల్ మందులు వాడితే చాలావరకూ ముప్పు తప్పినట్టే.

స్వైన్ ఫ్లూ
ఆ విషయాన్ని గుర్తుంచుకుని.. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనపడగానే వైద్యులను సంప్రదించాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలున్నవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు కర్చీఫ్‌గానీ, మెడికేటెడ్ మాస్క్‌గానీ అడ్డు పెట్టుకోండి.

స్వైన్ ఫ్లూ
రెండూ అందుబాటులో లేనప్పుడు అరచెయ్యి అడ్డం పెట్టుకుని కాకుండా మోచేతి మడతను నోరు, ముక్కు వద్ద అడ్డుపెట్టుకొని లోపలివైపునకు తుమ్మాలి/దగ్గాలి.

స్వైన్ ఫ్లూ
అలా కాకుండా అరచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మినా, దగ్గినా ఆ తర్వాత మీరు ఏ వస్తువును పట్టుకుంటే ఆ వస్తువు పైకి వైరస్ చేరుతుంది.

స్వైన్ ఫ్లూ
తర్వాత, మీ ఇంట్లో వాళ్లు ఎవరు ఆ వస్తువును ముట్టుకుని తమ ముక్కు, నోరు దగ్గర ఆ చేతిని పెట్టుకుంటే వారికీ ఆ వైరస్ సోకుతుంది.

స్వైన్ ఫ్లూ
ఒకవేళ పొరబాటున అరచేతిని అడ్డుపెట్టుకుని తుమ్మినా దగ్గినా వెంటనే చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలున్న వారికి షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు. సిటీ బస్సులు, రైళ్లల్లో సర్జికల్ మాస్కులు ధరించి మాత్రమే ఎక్కండి.
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 22 మంది, ఉస్మానియాలో ఒకరు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. రెండు ఆస్పత్రుల్లో కలిపి మరో 35 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయి.

స్వైన్ ఫ్లూ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెలలోనే స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య 187కు చేరింది. గాంధీలో ఇద్దరు, ఉస్మానియాలో ఒకరు చొప్పున ముగ్గురు జూనియర్ డాక్టర్లు సైతం స్వైన్ ఫ్లూ బారినపడ్డారు.












Click it and Unblock the Notifications