చిన్నారికి సూది గుచ్చేందుకు యత్నం: సైకోకు దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
హైదరాబాద్: ఇందిరానగర్‌లోని ఓ హోటల్ సమీపంలో సూది సైకో కలకలం సృష్టించాడు. చిన్నారికి సూదిగుచ్చేందుకు యత్నించాడు. చిన్నారి అరవడంతో ఉన్మాదిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు.
అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది చిన్నారులు, యువతులు, మహిళలకు సూది గుచ్చి పరారవుతున్న సైకో ఇతడేనా అనే కోణంలో పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.

వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి
హైదరాబాద్ నగరంలోని నాగోల్ బండ్లగూడలో రెండేళ్ల చిన్నారి ప్రణవి మృతి చెందింది. నిన్న అంగన్‌వాడీ కేంద్రంలో వ్యాక్సిన్ వేశాక చిన్నారి అస్వస్థతకు గురైంది. వ్యాక్సిన్ వికటించడం వల్లే చిన్నారి మృతిచెందినట్లు సమాచారం. అంగన్ కేంద్రం తీరువల్లే తమ చిన్నారి మృతిచెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పిచ్చి కుక్క స్వైరవిహారం: 8మందికి గాయాలు
వరంగల్ జిల్లాలోని మరిపెడ మండలం జేఆర్‌ఎం గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుక్కదాడిలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications