Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదీ మా పాలసీ: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కేసీఆర్ బంపరాఫర్, బాలకృష్ణ స్పందన

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు శుక్రవారం నాడు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు శుక్రవారం నాడు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. చారిత్రక సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం ఓ పాలసీగా పెట్టుకుందని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.

 Tax relief for Balakrishna's gautamiputra satakarni in Telangana

కేసీఆర్‌ను కలిసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. తాను కేసీఆర్‌ను మొదటి షోకు ఆహ్వానించానని చెప్పారు. వినోదపు పన్ను మినహాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు స్వయంగా కేసీఆర్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పారు.

సినిమాకు కేసీఆర్

సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా తెలిపారు. ప్రీమియర్‌ షోకు రావాల్సిందిగా ఆహ్వానించగా.. కేసీఆర్‌ అంగీకరించారని తెలిపారు.

ఈ చిత్రంపై కేసీఆర్‌ ముందు నుంచీ ఆసక్తి కనబరుస్తున్నారు. బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు. తెలుగుజాతి గర్వించదగ్గ శాతకర్ణి కథను తెరకెక్కించడం గర్వకారణమంటూ బాలకృష్ణను అభినందించారు. దీంతో పాటు ఈ సినిమాను తొలుత తనకే చూపించాలని కేసీఆర్‌ కోరారు. ఈ నేపథ్యంలోనే సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ.. కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పి, ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించారు.

కాగా, అంతకుముందు బాలకృష్ణ కేసీఆర్‌ను కలిసేందుకు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. అయితే కేసీఆర్‌ అసెంబ్లీలో లేరని క్యాంపు కార్యాలయానికి వెళ్లారని చెప్పడంతో ఆయన అక్కడికి వెళ్లారు.

 Tax relief for Balakrishna's gautamiputra satakarni in Telangana

క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. శ్రియ కథానాయిక. హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+