రేవంత్ ఆశలపై చంద్రబాబు దెబ్బ - లెక్క మారుతోంది..!!

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారుతోంది. ఈ సారి తెలంగాణలో అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ప్రతీ సీటు ప్రతిష్ఠాత్మకమే. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తరువాతి పరిణామాలు తెలంగాణలో రేవంత్ నాయకత్వానికి అనుకూలంగా మారుతున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు తాజా నిర్ణయంతో మొత్తంగా లెక్కే మారుతోంది. చంద్రబాబు ఏం చేయబోతున్నారు. రేవంత్ పైన ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది.

పోటీకి టీడీపీ సిద్దమేనా:తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపైన దాదాపు క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ వామపక్షాల పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ - జనసేన పొత్తు ఖరారైంది. సీట్ల అంశమే తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో ఏపీ ప్రాంత సెటిలర్లు హైదరాబాద్, రంగారెడ్డిలో ప్రధానంగా..ఇతర నియోజకవర్గాల్లో కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏపీ నుంచి తెలంగాణలో స్థిర పడిన వారిలో టీడీపీ, వైసీపీ మద్దతు దారులు ఉన్నారు. టీడీపీ మద్దతు దారులు చంద్రబాబు అరెస్ట్..తదనంతర పరిణామాలతో పోటీలో ఉంటే టీడీపీ..పోటీలో లేకపోతే కాంగ్రెస్ కు మద్దతివ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. బీజేపీ, టీడీపీ, జనసేన తెలంగాణలో కలిసి పోటీ చేసే అవకాశం లేదని తేలి పోయింది.

TDP Cheif Chandra Babu to finalise party contesting candidates for TS Elections soon

చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ:జనసేన తెలంగాణలో బీజేపీతో జత కడుతోంది. దీంతో, ఇప్పటి వరకు పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్న టీడీపీ తాజాగా పోటీకి నిర్ణయించింది. తెలంగాణలోని 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ
భావిస్తోంది. నియోజకవర్గాలు, టికెట్ ఆశిస్తున్న వారి ఎంపికపై రాష్ట్ర పార్టీ కసరత్తు పూర్తి చేసి జాబితాను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించింది.

రాష్ట్రంలో పోటీకి సంబంధించి చంద్రబాబు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జనసేన పోటీకి దిగటంతో..టీడీపీ పోటీ చేయకపోతే ప్రతికూల సంకేతాలు వస్తాయనేది టీడీపీ నేతల అభిప్రాయం. దీంతో, పోటీకి దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీకి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

TDP Cheif Chandra Babu to finalise party contesting candidates for TS Elections soon

రేవంత్ పై టీడీపీ ప్రభావం:అయితే, ఏపీ ఎన్నికలు..పొత్తులే ప్రధానంగా భావిస్తున్న చంద్రబాబు తెలంగాణ ఎన్నికల విషయంలో చివరి నిమిషంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మరో వైపు పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అదే జరిగితే టీడీపీకి మద్దతుగా నిలిచే ఓటర్లు రేవంత్ కు అనుకూలంగా వ్యవహరిస్తారని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు పోటీలో ఉండాలని నిర్ణయించి అభ్యర్దులను ఖరారు చేస్తే..

ఆ ఓట్లు టీడీపీని కాదని కాంగ్రెస్ కు పడే అవకాశం లేదనేది మరో వాదన. ఈ అంచనాలతో పోటీలో లేకుండా కాంగ్రెస్ కు సహకరించారనే అభిప్రాయానికి అవకాశం ఇవ్వటం కంటే..పోటీలో ఉండటం మంచిదని పార్టీ సీనియర్లు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు పోటీ పైన తీసుకొనే నిర్ణయం రేవంత్ పైన ప్రభావం పడే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+