హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ డాక్టర్‌ను బ్లాగుకీడ్చి టెక్కీ రచ్చరచ్చ, అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత కొంత కాలంగా వైద్యురాలిని వేధిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరును హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఓ వైద్యురాలి వెంట పడి చివరకు బ్లాగుల్లోకి ఎక్కి రాద్ధాంతం చేస్తున్నాడు.

మహబూబ్‌నగర్‌కు చెందిన అశోక్ కుమార్ నగరంలోని నారాయణగుడాలో నివసిస్తున్నాడు. లండన్‌లో ఎమ్మెస్ చేసి సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఇతనికి కొంత కాలం క్రితం మాట్రిమోనియల్ సైట్ ద్వారా అమెరికాలో విద్యను అభ్యసించి వచ్చిన అంబర్‌పేటకు చెందిన వైద్యురాలితో పరిచయం ఏర్పడింది.

 Techie arrested for harassing lady doctor

ఒకరినొకరు ఇష్టపడడంతో కొంత కాలం పాటు సంప్రదింపులు జరిపారు. అనివార్య కారణాల వల్ల కొన్నాళ్లుగా ఆమె అశోక్‌కు దూరంగా ఉంటోంది. దీన్ని తట్టుకోలేక అతను వెంటపడి వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె గతంలోనే అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇటీవల అతను కొన్ని బ్లాగుల్లో వైద్యురాలిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పట్టడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ పి. రాజు సాంకేతిక ఆధారాలను బట్టి అశోక్ కుమార్‌ను అరెస్టు చేశారు.

English summary
A techie Asholk Kumar has been arrested for harassing a lady doctor in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X