టెక్కీ దుర్బుద్ధి, క్లాస్‌మేట్‌కే లైంగిక వేధింపులు, వీడియోలు అశ్లీల సైట్‌లో పోస్ట్ చేస్తానంటూ...
హైదరాబాద్: ఓ టెక్కీ బుద్ధి పెడదారి పట్టింది. పదో తరగతిలో తన సహ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెకు పెళ్లైపోయినా ఇతడి వేధింపులు మాత్రం ఆగలేదు. మరో యువతి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచి ఆ ఖాతా నుంచి ఈ యువతికి సందేశాలు పంపడం ప్రారంభించాడు.
ఆమెకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, తనతో గడపకపోతే వాటిని అశ్లీల వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు ఆమె స్నేహితుడే నిందితుడిగా తేల్చారు. సదరు టెక్కీని గుర్తించి అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్‌కుమార్(24) కొంతకాలం కిందట నగరానికి వచ్చి కూకట్ పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తూ ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
2008లో అతడు పదో తరగతి చదివిన సమయంలో అతడి క్లాస్‌మేట్ అయిన ఓ యువతి ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌లో ఉంటోంది. 2011 నుంచి ఆమె ఫేస్‌బుక్ ఉపయోగిస్తోంది. 2012లో ఆమెకు వివాహం కూడా అయింది.
కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటోన్న హేమంత్ కుమార్ ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు. ఒకరి వివరాలు మరొకరికి తెలిశాక.. అతడు తనకు పదో తరగతిలో క్లాస్‌మేట్ అని ఆమెకూ తెలిసింది. ఆ చనువుతో ఫేస్‌బుక్‌లో హేమంత్‌తో చాటింగ్ చేయడం, ఫోన్‌లో మాట్లాడుకోవడం జరిగాయి.
ఆ యువతి పట్ల ఆకర్షితుడైన హేమంత్ ఎలాగైనా ఆమెను తన అధీనంలోకి తెచ్చుకోవాలని ప్లాన్ వేశాడు. తన ఫేస్‌బుక్ ఖాతానుంచి సందేశాలు పంపితే పట్టుబడిపోతానని గ్రహించి.. బండ్ల ప్రియాంక అనే పేరుతో మరో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి దాన్నుంచి తన క్లాస్‌మేట్ అయిన యువతికి లైంగిక వేధింపుల సందేశాలు పంపించడం ప్రారంభించాడు.
తనతో శృంగారంలో పాల్గొనాలని, లేదంటే ఆమె వీడియోలను తాను అశ్లీల వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు మితిమీరడంతో బాధితురాలు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టి చాటింగ్ చేసిన ఐపీ వివరాల ఆధారంగా నిందితుడు ఆమె స్నేహితుడేనని తేల్చి హేమంత్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications