వరంగల్ ఎన్ఐటీలో టెక్నోజియాన్.. మొదలైన ఈవెంట్ల రచ్చ!
విద్యార్థులే నిర్వాహకులుగా సంవత్సరంలో రెండు సార్లు ఎన్ఐఐటి అత్యంత ఘనంగా నిర్వహించే టెక్నికల్ ఫెస్టివల్ వరంగల్ ఎన్ఐటిలో ప్రారంభమైంది. వరంగల్ లోని ఎన్ఐటిలో టెక్నోజియాన్ 2024 కార్యక్రమం నిన్న సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది. మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు హాజరుకానున్నారు.
టెక్నోజియాన్ 24 లో 50 కంటే ఎక్కువ ఈవెంట్లు
ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించే ఈ టెక్నోజియాన్ సాంకేతిక ఫెస్టివల్ లో సుమారు 6000 మంది విద్యార్థులు పాల్గొని సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకుంటారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న టెక్నోజియాన్ 24 లో 50 కంటే ఎక్కువ ఈవెంట్లు ప్లాన్ చేశారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తొలి రోజు కార్యక్రమానికి హైదరాబాద్ సిఎస్ఐఆర్ ఐసిటి సైంటిస్ట్ ఎన్వి చౌదరి ప్రారంభ ఉపన్యాసం చేశారు.

సాంకేతిక నైపుణ్యాల మెరుగుదలకు టెక్నోజియాన్ గొప్ప వేదిక
దేశంలోని సమస్యలకు ఎన్ఐటి విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలతో పరిష్కారాలు అందించాలని పేర్కొన్నారు. విజ్ఞానాన్ని, నెట్వర్క్ ను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఇటువంటి టెక్నాలజీ కార్యక్రమాలు గొప్ప వేదికగా ఉంటాయని ఆయన తెలిపారు. టెక్నోజియాన్ ను ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకొని ప్రతి విద్యార్థి ఈవెంట్స్ లో పాల్గొనాలని, సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.
అందరికీ మంచి లెర్నింగ్ ప్లాట్ ఫాం
ఇక వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి,టెక్నికల్ సొసైటీ టెక్నోజియాన్ గురించి వమాట్లాడుతూ విద్యార్థులు డిపార్ట్‌మెంట్లు మరియు క్లబ్‌ల నుండి కార్యకలాపాలను ఒకచోట చేర్చడానికి కృషి చేశారని అన్నారు. ఇది అందరికీ మంచి లెర్నింగ్ ప్లాట్ ఫాం అన్నారు.స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ డి.శ్రీనివాసాచార్య మాట్లాడుతూ సవాల్ గా ఉన్న ఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థుల కోసం 48 గంటల హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్ఐటీలో ఈవెంట్స్ రచ్చ
ఇక నేడు షెడ్యూల్లో భాగంగా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, డేటా సైన్స్ కాంటెస్ట్, సర్క్యూట్ చేంజ్, కెమికల్ ఎక్స్పో ఎగ్జిబిషన్, డ్రోన్ వెలోసిటీ స్టేడియం, రీసెర్చ్ పేపర్ ప్రెజెంటేషన్, మెటా ఫోర్జ్, కెమికల్ రిలే రేస్, మెటా ల్యాబ్ వర్క్ షాప్, క్యాంపస్ ఇన్నోవ్ 8, ఐడియాథాన్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఇందులో ఈవెంట్స్ లో రచ్చ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications