జనవరి 1 సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం - ఆ రోజు సెలవు రద్దు..!!

నూతన సంవత్సరం వేడుకలకు రంగం సిద్దం అవుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నట్లు తెలిపింది. జనవరి 1 ని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పార్టీలలో డ్రగ్స్ వినియోగం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నట్లు తెలిపింది. పబ్ లు, క్లబ్ లు, బార్, రెస్టారెంట్లు, హోటళ్లు ఒంటి గంట వరకు తెరచుకునేందుకు అనుమతించనుంది. అయితే, ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

Telagnana Govt Declared january 1st as General Holiday, cancelled holiday in February

న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 1ని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లే యువత, ఇతరులంతా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేసారు. డిసెంబర్ 31 ఆదివారం కావటం..జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించటంతో వరుసగా రెండు రోజులు సెలవులు కలిసి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+