2026 సెలవుల లిస్ట్ రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్.. ఏకంగా 38 రోజులు..!
2026 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన జనరల్ హాలిడేస్.. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలకు వర్తించే సెలవులను ఖరారు చేశారు. 2026 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను ప్రకటిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనరల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
2026 కు సంబంధించి సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. 2026 సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను ప్రకటిస్తూ అధికారికంగా సోమవారం ఉత్తర్వులు (జీవో నంబరు 1715) జారీ చేసింది. దాంతో పాటు ప్రతి నెలలోని ఆదివారాలు, రెండో శనివారాలు యథావిధిగా సెలవు రోజులుగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
2026లో తెలంగాణ సర్కార్ ప్రకటించిన సాధారణ సెలవుల వివరాలు చూస్తే.. సంక్రాంతి (జనవరి 15), గణతంత్ర దినోత్సవం (జనవరి 26), హోలీ (మార్చి 3), ఉగాది (మార్చి 19), రంజాన్ (మార్చి 21), శ్రీ రామనవమి (మార్చి 27), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)బక్రీద్ (మే 27), బోనాలు పండుగ (ఆగస్టు 10), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15, వినాయక చవితి (సెప్టెంబర్ 14), దసరా (అక్టోబర్ 20), దీపావళి (నవంబర్ 8), క్రిస్టమస్ (డిసెంబర్ 25) గా ఉన్నాయి.

ఇక 2026 లో ఐచ్ఛిక సెలవుల వివరాలు చూస్తే.. జనవరి 1 నూతన సంవత్సరం, జనవరి 3 హజ్రత్ అలీ జన్మదినం, జనవరి 16 కనుమ, మార్చి 31 మహావీర్ జయంతి, మే 1 బుద్ధ పౌర్ణమి, నవంబర్ 8 నరక చతుర్దశి, డిసెంబర్ 24 క్రిస్టమస్ ఈవ్.. గా ఉన్నాయి. అయితే.. వాటిల్లో ఉద్యోగులు తమ ఇష్టప్రకారం గరిష్టంగా 5 రోజులు మాత్రమే తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications