నాకు పిండం పెడతారా- మీ తోలు తీయడం పెద్ద సమస్య కాదు: అసెంబ్లీలో కేసీఆర్ విశ్వరూపం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ ముగియనున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగిస్తోన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలు, ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలను కేసీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు.

చివరి రోజు సెషన్‌లో కేసీఆర్ తన విశ్వరూపాన్ని చూపారు. తెలంగాణలో మళ్లీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, భారత్ రాష్ట్ర సమితి తిరిగి అధికారాన్ని చేపడుతుందని తేల్చి చెప్పారు. 2018లో వచ్చిన సీట్ల కంటే ఏడెనిమిది సీట్లు అధికంగా తమకు లభిస్తాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.

Telangana Assembly: BRS will come to power again, says CM KCR

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరు విషయంలో అనర్హత వేటును ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విషయాన్ని కేసీఆర్ సభలో ప్రస్తావించారు. మోదీ ఇంటి పేరు విషయంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో సభ్యత్వాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. తనకు పిండప్రదానం చేస్తానంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని తాను కూడా అనర్హత వేటు వేయొచ్చని అన్నారు.

పిండ ప్రదానం చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోలేమా?.. అని ప్రశ్నించారు. తాము ఉదారవాదులమని, కాంగ్రెస్‌కు ఎంత స్వేచ్ఛ కావాలంటే అంత స్వేచ్ఛ ఇచ్చామని అన్నారు. అందుకే కఠిన నిర్ణయాలను తీసుకోవట్లేదని కేసీఆర్ అన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెలంగాణను సాధించుకున్నామని, ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచామని, విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు.

ఇన్ని చేసిన తనకు కాంగ్రెస్ నాయకులు పిండం పెడతానని ప్రకటిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఇన్ని మంచి పనులు చేసినందుకు పిండం పెడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను భుజాన వేసుకుని, అష్టకష్టాలు పడి, దీక్షలు చేస్తే పిండం పెడతానని అంటారా? అంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు. కాంగ్రెస్ సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.

ఉదారంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటున్నామని, లేకపోతే కాంగ్రెస్ నాయకుల తాట తీయడం పెద్ద సమస్య కాదు కదా? అని కేసీఆర్ అన్నారు. అడ్డగోలుగా మాట్లాడినా తాము సంయమనం పాటిస్తోన్నామని, కాంగ్రెస్‌పై పోలీసులను ప్రయోగించట్లేదని అన్నారు. ప్రజలే తీర్పు ఇస్తారనే ఉద్దేశంతో తాము ఉన్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+