తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: జుక్కల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జుక్కల్ ఒకటి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్. ఇది జహీరాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి హన్మంత్ షిండే 35,507 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత గంగారామ్ ఎస్ పైన గెలుపొందారు. టీఆర్ఎస్ హన్మంత్ షిండేకు 72,901 ఓట్లు రాగా, కాంగ్రెస్ నేత గంగారామ్ ఎస్‌కు 37,394 ఓట్లు వచ్చాయి. 1957 నుంచి 1983 వరకు కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), ఇండిపెండెంట్లు గెలుచుకుంటూ వచ్చారు. 1985లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 1994, 1999లలో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ గెలిచింది. 2014లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.













Click it and Unblock the Notifications