తెలంగాణ ఎఫెక్ట్ -ఏపీలో కాంగ్రెస్ ఎంపీ సీట్లకు డిమాండ్ ?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే ప్రజలు కట్టం కట్టబోతున్నట్లు తేల్చేశాయి. దీంతో డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చివరి నిమిషంలో అద్భుతాలు జరిగితే తప్ప ఇందులో ఎలాంటి మార్పు ఉంటే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో ఈ ఫలితాలు ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయి.

ఏపీ విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి తీసికట్టులా మారిపోయింది. ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ గురించి ఆలోచించే పరిస్దితి లేదు. ఆ పార్టీ ఒకటి పోటీలో ఉందన్న విషయమే జనం మర్చిపోయారు. ఇంత దీనావస్ధలో పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాటలో ఉండటం ఇక్కడి నేతలకు కచ్చితంగా బూస్ట్ ఇస్తోంది. ఇప్పటివరకూ వచ్చే ఎన్నికలపైనా ఎలాంటి ఆశలు పెట్టుకోని కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు మాత్రం ఎక్కడ లేని ఆశలు చిగురిస్తున్నాయి.

 telangana boost to ap congress? demand to loksabha seats !

ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్ధులుగా నిలిచేందుకుతర పార్టీలకు చెందిన వారు పోటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు బిగ్ షాట్లు ధైర్యం చేసే అవకాశాన్ని తెలంగాణ ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పొరుగున ఉన్న ఏపీలోనూ ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని, తిరిగి పాత రోజులు రాకపోయినా కాస్తో కూస్తో పుంజుకోవడం ఖాయమని అధిష్టానం కూడా లెక్కలు వేసుకుంటోంది.

క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితి గమనిస్తే రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకూ అభ్యర్ధులు లేరు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపడితే అక్కడి సీఎం, మంత్రులు ఏపీలో తరచుగా పర్యటించడం మొదలుపెడతారు. అలాగే ఇక్కడ పోటీకి అభ్యర్ధులు కూడా దొరకడం మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ సీట్లలో పోటీకి ఇన్నాళ్లు వెనుకాడిన వారు కూడా ఈసారి ముందుకొచ్చే అవకాశముందని చెప్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం రెండు చోట్ల అయినా కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే అవకాశం ఉండటంతో ఆ ప్రభావం ఏపీపై ఉంటుందనేది వారి అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+