తెలంగాణలో ఆ విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ సూట్, షూస్
తెలంగాణలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రంలో విడతల వారీగా 571 కొత్త ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాంతోపాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అబ్బాయిలకు ఒకటి, అమ్మాయిలకు ఒకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని స్టూడెంట్స్ కు ఉచితంగా స్పోర్ట్స్ షూస్, సూట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లోని ఎల్ కేజీ, యూకేజీ ల్లో ఇంగ్లీష్ మీడియం, ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణం, అంగన్ వాడీల్లో మెనూ మార్పు తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విద్యాలయాల్లో చదివే స్టూడెంట్స్ కు ఉచితంగా స్పోర్ట్స్ షూస్, సూట్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్ష మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీనికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇవ్వనుంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

ఇక తెలంగాణలోని విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించింది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేశారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు నిర్మించనున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. అంతేకాక వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని 11,476 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి జరిగిన ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని 5,992 స్కూల్స్ లో BSNL సంస్థ ఫ్రీగా ఇంటర్నెట్ అందిస్తోంది.












Click it and Unblock the Notifications