పెళ్లిలో బాయ్‌ఫ్రెండ్ కనిపించడంతో.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు..
తెలంగాణలోని వనపర్తి జిల్లా చర్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ వివాహ వేడుకలో వధువు ఊహించని షాక్ ఇచ్చింది. వివాహానికి అంతా సిద్దమై.. పురోహితుడు పెళ్లి క్రతువును మొదలుపెట్టిన సమయంలో వధువు అందరినీ విస్తుపోయేలా చేసింది. వరుడు మరికాసేపట్లో తాళి కడుతాడనగా.. పీటలపై నుంచి లేచి తనకీ పెళ్లి వద్దని చెప్పి.. హాలు నుంచి బయటకు నడిచింది.
దీంతో పెళ్లికి వచ్చినవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. వధువుకు ఆమె కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె ఎవరి మాటా వినిపించుకోలేదు. ఆ తర్వాత కాసేపటికే ఆమె హాలు బయట కనిపించలేదు. పెళ్లిలో మాజీ బాయ్‌ఫ్రెండ్ కనిపించడంతో.. ఆమె అతనితో వెళ్లిపోయిందని.. తాము అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయిందని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇటీవల కేరళలోని తిరురంగడిలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. పెళ్లికి కొద్ది గంటల ముందు వధువు తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది. ఇదే విషయాన్ని వరుడి కుటుంబానికి చెప్పడంతో.. అందరి ముందు పరువు పోకుండా ఉండేందుకు.. అదే ముహూర్తానికి అతనికి మరో అమ్మాయితో పెళ్లి జరిపించారు.












Click it and Unblock the Notifications