Telangana Budget 2025: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూ. 3.05 లక్షల కోట్ల ప్రతిపాదన
Telangana Budget Live: తెలంగాణ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంచనా విలువ అక్షరాలా రూ. 3,04,965 కోట్లు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రివర్యులు తెలిపారు. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారికి జవాబుదారీగా పాలన సాగిస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు. తాత్కాలిక , దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ ప్రతి చర్యను విమర్శిస్తూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు కేంద్రం తక్కువ నిధులు కేటాయంచడం అన్యాయని పేర్కొన్నారు.

ఈ బడ్జెట్‌లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపులు చూస్తే పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,605 కోట్లు, వ్యవసాయ శాఖ రూ. 24,439 కోట్లు,విద్యా శాఖ రూ. 23,108 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ. 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం: రూ. 17,169 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 11,405 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ రూ. 2,862 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ రూ. 3,591 కోట్లు, పశుసంవర్ధక శాఖ రూ. 1,674 కోట్లు,
పౌర సరఫరాల శాఖ రూ. 5,734 కోట్లు, కార్మిక శాఖ రూ. 900 కోట్లు, చేనేత రంగానికి రూ. 371 కోట్లు, పరిశ్రమల శాఖ రూ. 3,527 కోట్లు, ఐటీ రంగానికి రూ. 774 కోట్లు, గ్యాస్ సిలిండర్ రాయితీ-రూ723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు, ఎస్డీఎఫ్, సీడీపీ నిధులు రూ.3300 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాది వేస్తుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందని చెప్పారు..ఇక తెలంగాణ బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.












Click it and Unblock the Notifications