తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజలు తమకు అప్పగించిన అధికారాన్ని బాధ్యతగా భావించి పాలన చేస్తున్నామని చెప్పారు. మభ్య పెట్టే ప్రజలకు చేయని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ బడ్జెట్ ఉంటుందని భట్టి తన ప్రసంగంలో స్పష్టం చేసారు. రైతు సంక్షేమం.. మహిళా సాధికారత.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించారు. రూ 3,24,234 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. శాఖల వారీగా కేటాయింపులను ప్రకటించారు.

రెండేళ్ల పాలనలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తి కరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు. ఈ బడ్జెట్ లో రూ 2,34,406 కోట్లు రెవిన్యూ వ్యయంగా.. రూ 47,267 కోట్లు మూలధన వ్యయంగా బట్టి తన బడ్జెట్ లో ప్రతిపాదించారు. పశుసంవర్ధకశాఖ - రూ.1,529 కోట్లు, వ్యవసాయ శాఖ - రూ.23,179 కోట్లు కేటాయించారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

Telangana Budget 2026 Deputy CM Bhatti Vikramarka major Allocations for Infrastructure amp amp Welfare here the details

అదే విధంగా విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ప్రతీ నెలా రూ 2 వేల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు భట్టి వెల్లడించారు. శాఖల వారీగా రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు, సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖ - రూ.1,529 కోట్లు, విద్యుత్ - రూ.21,285 కోట్లు, విద్యా శాఖ - రూ.26,674 కోట్లు, వైద్యం - రూ.13,679కోట్లు, కార్మికుల సంక్షేమం - రూ.999 కోట్లు, మహిళా శిశు సంక్షేమం - రూ.3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమం - రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమం - రూ.7,937కోట్లు, బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమం - రూ.3,769 కోట్లు కేటాయించారు.

అదే విధంగా రాజీవ్ యువ వికాసం - రూ.6వేల కోట్లు, గృహ నిర్మాణం - రూ.7,430 కోట్లు, ఐటీ రంగం - రూ.875 కోట్లు, పరిశ్రమలు - రూ.3,490 కోట్లు, చేనేత - రూ.258 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.33,688 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులు - రూ.22,615 కోట్లు, రవాణా శాఖ - రూ.12,759 కోట్లు, న్యాయ శాఖ - రూ.2,367 కోట్లు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ - రూ.17,907కోట్లు ప్రతిపాదించారు. శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు, పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+