తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మేరకు సామాజిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కీలక బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగాలు.. నేరాల నిరోధక బిల్లుకు తెలంగాణ కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 40 లక్షలమందికి పైగా గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం 'తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్- 2026' కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వర్కర్ల రిజిస్ట్రేషన్ తో పాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వీరికి చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది.
దాంతోపాటు తెలంగాణ కేబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలను కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేసే విధంగా బిల్లును తీసుకొచ్చింది.

అలాగే రాష్ట్రంలో ఇటీవలి కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇక కుల గణనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేబినెట్ ఆమోదించింది. ఇక విద్యాసంస్థల్లో కుల వివక్షను నివారించేందుకు 'రోహిత్ వేముల చట్టం' విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications