తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ శుభవార్త..!
తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. త్వరలో తెలంగాణలో మద్యం ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ నోటిఫికేషన్ లో స్థానిక, విదేశీ సరఫరాదారుల నుంచి కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఏకంగా 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి పరిచయం చేసేందుకు దరఖాస్తు చేశాయి.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బీర్లు, మద్యం రేట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. స్థానిక, విదేశీ సరఫరాదారుల నుంచి కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) జారీ చేసిన నోటిఫికేషన్ కు అనూహ్య స్పందన వచ్చింది. 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో 331 స్వదేశీ మద్యం బ్రాండ్లు కాగా.. 273 విదేశీ మద్యం బ్రాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్ లో పోటీ పెరిగిపోయి త్వరలో మద్యం ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది.
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో మద్యం నుంచి వచ్చే ఆదాయం అధికంగానే ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మద్యం మార్కెట్ ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 23, 2025న నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనూహ్యంగా 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.

వీటిలో 331 భారతీయ మద్యం బ్రాండ్లు, 273 విదేశీ బ్రాండ్లు ఉన్నాయి. ఇప్పటికే 47 కొత్త కంపెనీలు 386 బ్రాండ్స్ ను ప్రతిపాదించింది. మరో 45 సరఫరా కంపెనీలు 218 బ్రాండ్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో మద్యం మార్కెట్ లో పోటీ పెరిగి త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) తయారీని నిలిపివేయడంతో మార్కెట్ లో బీర్ల కొరత ఏర్పడింది. అయితే తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు యూబీఎల్ నుంచి భారీగానే బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు సక్సెస్ కావడంతో మళ్లీ బీర్ల తయారీ ఊపందుకునే అవకాశం ఉంది.
ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ రూ.34,600 కోట్ల ఆదాయాన్ని పొందినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications