హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపాకీ పెట్టి వివాహితపై అత్యాచారం, కిడ్నాప్: సీఐ నాగేశ్వరావు ఉద్యోగం ఊడింది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాహితపై అత్యాచారం, కిడ్నాప్‌, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్టయిన మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుకు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న నాగేశ్వరరావును పోలీస్‌ శాఖ సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

 నేర ప్రవృత్తి.. సీఐ నాగేశ్వరావు ఉద్యోగం ఊడింది

నేర ప్రవృత్తి.. సీఐ నాగేశ్వరావు ఉద్యోగం ఊడింది

తెలంగాణ పోలీసు నియామక నిబంధనలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(బీ) ద్వారా దఖలుపడిన అధికారంతో ఎటువంటి విచారణ లేకుండా నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. కోరట్ల నాగేశ్వరరావుపై వచ్చిన అభియోగాలపై శాఖాపరమైన విచారణ నిర్వహించడం ఆచరణపరంగా సాధ్యం కాదని సీపీ అభిప్రాయపడ్డారు. విచారణ నిర్వహిస్తే సాక్షులు, బాధితులను నాగేశ్వరరావు బెదిరించే అవకాశాలున్నాయని అన్నారు. నాగేశ్వరరావుది నేర ప్రవృత్తిగల మనస్తత్వమనే విషయం అనేక సందర్భాల్లో రుజువైందని తెలిపారు.

వివాహితను ఫాంహౌస్‌కు రావాలంటూ నాగేశ్వరరావు

వివాహితను ఫాంహౌస్‌కు రావాలంటూ నాగేశ్వరరావు

నాగేశ్వరరావు పాల్పడిన దారుణాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిందితుడు నాగేశ్వరరావుకు హైదరాబాద్‌ శివారులో ఫాంహౌస్ ఉంది. నాలుగేళ్ల కిందట బాధిత మహిళ భర్తను ఒక కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు అతడిని విచారించాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక అతడిని తన ఫాంహౌస్‌లో నియమించుకున్నాడు. అయితే, బాధిత దంపతులు వేరేచోట నివసించేవారు. ఇన్‌స్పెక్టర్‌ ఒకరోజు బాధిత మహిళను ఫామ్‌హౌస్‌కు వెళ్దామని పిలిచాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా.. వెంటనే అతడు నాగేశ్వరరావుకు ఫోన్‌ చేశాడు. ఇదంతా మీ భార్యకు చెబుతానని హెచ్చరించడంతో.. 'తప్పయింది.. క్షమించు' అంటూ నాగేశ్వరరావు అతడిని వేడుకున్నాడు. దీంతో ఈ వివాదం అక్కడితో సద్దుమణిగింది.

వివాహిత భర్తకు నాగేశ్వరరావు బెదిరింపులు

వివాహిత భర్తకు నాగేశ్వరరావు బెదిరింపులు

ఆ తర్వాత మరోసారి నాగేశ్వరరావు తన దుర్భిద్ధిని చూపించాడు. తనను బెదిరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన నాగేశ్వరరావు బాధిత మహిళ భర్తను ఒకరోజు సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి రప్పించాడు. అతడి జేబులు, చేతుల్లో గంజాయి సంచులు ఉంచి వీడియోలు, ఫొటోలు తీయించాడు. వాటి ఆధారంగా కేసు నమోదు చేయిస్తానని బాధితుడిని హెచ్చరించాడు. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి వరకు ఫామ్‌హౌస్‌లో పనిచేసిన అతడు.. తర్వాత పని మానేశాడు. వనస్థలిపురంలో భార్యా పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయినప్పటికీ నాగేశ్వరరావు వారిని విడిచిపెట్టలేదు. వారి కదలికలపై నిఘా పెట్టాడు.

తుపాకీ గురిపెట్టి వివాహితపై రేప్.. నాగేశ్వరరావు దారుణాలు ఇలా

తుపాకీ గురిపెట్టి వివాహితపై రేప్.. నాగేశ్వరరావు దారుణాలు ఇలా

ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని కామ వాంఛతో రగిలిపోతున్న ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు.. జులై 6న బాధితురాలికి వాట్సప్‌ కాల్‌ చేశాడు. 'నీ మొగుడు ఊళ్లో లేడుగా... నేను వస్తున్నా' అంటూ మాట్లాడాడు. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. ఆ సమయంలో సొంతూరులో ఉన్న అతడు.. తాను వస్తున్నానని ఆమెకు బదులిచ్చాడు. అతడు రాడనుకున్న నాగేశ్వరరావు.. రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. తలుపు వేసి ఆమెను కొట్టాడు. రివాల్వర్‌ గురిపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. అర్ధరాత్రి దాటే వరకు ఆమె ఇంట్లోనే ఉన్నాడు. ఈలోపు ఆమె భర్త తిరిగివచ్చాడు. ఇంట్లో ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును చూసి ఆగ్రహించి.. కర్రతో కొట్టాడు. వెంటనే నాగేశ్వరరావు రివాల్వర్‌తో భార్యాభర్తలను చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకుని తన ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరగా.. ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై టైరు పేలింది. కారు ఆగిపోవడంతో దంపతులిద్దరూ అతని బారినుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో నాగేశ్వరరావు దారుణాలు వెలుగులోకి వచ్చాయి. మరికొంత మంది బాధితులు కూడా నాగేశ్వరరావుపై ఫిర్యాదులు చేశారు. నాగేశ్వరరావు నేరాలను సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు చివరకు అతడ్ని పోలీసు సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించారు.

English summary
CI Nageshwar Rao losts his job for raping a married woman and kidnap case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X