రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ - 5వ తేదీ వరకే ఛాన్స్..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పైన తాజాగా మరో అవకాశం కల్పించింది. మూడు నెలల బియ్యం ఒకే సారి అందిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం.. ప్రస్తుత పరిస్థితుల వేళ మూడు నెలల బియ్యం ఒకే సారి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా చాలా మంది లబ్దిదారులు ఇంకా తీసుకోకపోవటంతో వారి కోసం తాజా నిర్ణయాన్ని వెల్లడించారు.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ బిగ్ డెసిషన్ తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సేకరణ గడువును ప్రభుత్వం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మొత్తం మూడు నెలల బియ్యం కోటాను ఒకేసారి లబ్ధిదారులకు అందించాలని జూలై నెలాఖరులోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, చాలా మంది ఇప్పటికీ బియ్యం తీసుకోవటంలో ఆలస్యం కావటంతో సమయం పొడిగించాలని కోరుతున్నారు. పూర్తి కోటా పంపిణీ ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభమై, ఆగస్టు 31 నాటికి ముగియాల్సి ఉంది. అయితే ఈ కింది కారణాల వల్ల ప్రభుత్వం పంపిణీ గడువును మరో 5 రోజులు పొడిగిస్తూ నిర్ణయించారు.

రేషన్ లబ్ది దారులకు వెసులుబాటు
ప్రత్యేక పరిస్థితుల వేళ ఒకే సారి మూడు నెలల బియ్యం అందించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీంతో.. పెద్ద సంఖ్యలో ఒకే సమయంలో డీలర్లు.. రేషన్ దుకాణాల వద్ద లబ్దిదారులు బారులు తీరారు. ఆ తరువాత వరుస సెలవుల కారణంగా పలువురు ఈ బియ్యం కోటాను వినియోగించుకోలేక పోయినట్లు గుర్తించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్నబియ్యం లభించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత కోటా పొందే అవకాశం ఉండదని, అందుకే ఆ లోపే సమీప పోర్టబిలిటీ లేదా తమ కేటాయించిన రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో.. ఒకే విడతలో మూడు నెలల బియ్యం పొందే అవకాశం లబ్దిదారులకు దక్కింది.













Click it and Unblock the Notifications