అద్భుతంగా, సకల హంగులతో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్, ఖర్చు రూ.50 కోట్లు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ కార్యాలయం సకల హంగులతో ఉండనుంది. ఆయన నివాసం, క్యాంప్ కార్యాలయం పనులు కొనసాగుతున్నాయి. ఇంకా కొద్దిగా మాత్రమే పనులు మిగిలి ఉన్నాయి.

ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. బేగంపేట క్యాంప్ కార్యాలయం నివాసానికి అనువుగా లేదని పంజగుట్ట వద్ద నిర్మిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించారు. ఈ కాంట్రాక్టును షాపూర్‌జీ-పల్లోంజీ సంస్థ దక్కించుకుంది.

Telangana CM KCR camp office, house with 50 Crores!

భవన సముదాయం కోసం మొత్తం తొమ్మిది ఎకరాలు కేటాయించారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో మూడు భవనాలను నిర్మిస్తున్నారు. మిగిలిన ఎనిమిది ఎకరాలలో 300 కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాన్ని మొక్కలతో నింపనున్నారు.

ఈ భవన నిర్మాణానికి రూ.33 కోట్లు అవుతుందని తొలుత భావించారు. కానీ ఇప్పుడు అది రూ.50 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. క్యాంప్ కార్యాలయం చుట్టూ కిలో మీటర్ మేర ప్రహరీ గోడ నిర్మించనున్నారు. క్యాంప్ కార్యాలయం దసరా నాటికి పూర్తి చేయాలనుకున్నప్పటికీ, అది కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+