నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్, మంత్రుల భేటీ: చర్చించిన అంశాలివే
న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లై ఓవర్ల ప్రాజెక్టుల అంశంపై కేంద్రమంత్రితో సీఎం చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ప్రధాన రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు అంశాలపై సుమారు గంటపాటు చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు సమాచారం.

వీటితో పాటు భువనగిరి రహదారి, సిర్పూర్ - కాగజ్‌నగర్ నేషనల్ హైవే, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెనను మరో చోటికి మార్పు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినట్లు సమాచారం.
కాగా, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడంపై రేవంత్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. బకాయిలు సహా వివిధ రూపాల్లో వచ్చే గ్రాంట్లను పొందేలా కసరత్తు కొనసాగిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక విజ్ఞాపన చేస్తున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం: ఎయిర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ విధింపు -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications