ట్రంప్ కంటే బాబు, లోకేష్ గొప్పోళ్లు-ఏదో రోజు..! కమ్మ వన భోజనాల్లో..!

తెలుగు రాష్ట్రాల్లో ఏటా కార్తీకమాసంలో నిర్వహించే వనసమారాధనలు, వనభోజనాలు కొంతకాలంగా కుల భోజనాలుగా మారిపోయాయన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. గతంలో కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే ఈ కార్యక్రమాలు కాస్తా కొంతకాలంగా కులాల వారీగా నిర్వహించుకుంటున్నారు. అంతే కాదు ఈ కార్యక్రమాల్లో ఆయా కులాలకు చెందిన పెద్దల్ని ఆహ్వానించి వారి సమక్షంలోనే కులాల్ని పొగిడే కార్యక్రమం కూడా పెడుతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన తెలంగాణలో జరిగింది.

ఇవాళ కూకట్ పల్లిలో నిర్వహించిన కమ్మ సామాజిక వర్గ వన భోజనాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేత, గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన బండి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సామాజిక వర్గ గొప్పతనాన్ని చెప్పుకునే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతే కాదు ఆయన వ్యాఖ్యల వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అంతా ఇదే చర్చ.

Telangana Congress Leader s Bold Claim Chandrababu Nara Lokesh Greater Than Trump

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూకట్ పల్లి కాంగ్రెస్ నేత బండి రమేష్.. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్ కంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప‌వాడు కాదంటూ వ్యాఖ్యానించారు. ఇదేం గొప్పకాదని, ట్రంప్ కూడా ఎక్కడి నుంచో రాలేదని మనలాంటి సాధారణ పౌరుడే అన్నారు. అంతటితో ఆగకుండా ప్రపంచాన్ని ఏలే కమ్మవాడు పుడతాడని, ఏదో ఒకరోజున ప్రపంచాన్ని క‌మ్మ‌వాడే ఏలుతాడన్నారు. ఇది తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు చరిచి ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+