DSC 2024: డీఎస్సీ పరీక్షల తేదీలు ప్రకటన..
డీఎస్సీ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ నోటీఫికేషన్ వచ్చింది. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అయితే తాజాగా విద్యా శాఖ దరఖాస్తుల గడువును పొడిగించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటితో డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
అయితే దరఖాస్తుల గడువును జూన్ 20 వరకు పొడిగించారు. డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించి జూన్ 20 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 11,062 డీఎస్సీ పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు 6,508 ఉండగా భాషా పండితులు 727, పీఈటీలు 182 ఉన్నాయి. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉండగా..ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి.

తెలంగాణలో అత్యధిక హైదరాబాద్‌లో 878 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ 605, నిజామాబాద్ 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ డీఎస్సీలో వీటిని భర్తీ చేయనున్నారు. అటు ఏపీలో కూడా డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ ఎన్నికలు ఉండడంతో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది.
ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి నుంచే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 2280 ఉండగా.. స్కూల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు 2299, టీజీటీ ఉద్యోగాలు 1264, పీజీటీ ఉద్యోగాలు 215 ఉన్నాయి. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డీఎస్సీకి బ్రేక్ పడింది. అయితే తెలంగాణలో లోక్ సభ ఎన్నికలున్నా.. డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications