తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు అందుబాటులోకి: డౌన్‌లోడ్ చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్(EAMCET) హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం వెబ్‌సైట్లో ఉన్నత విద్యామండలి వీటిని ఉంచింది. విద్యార్థులు ఆదివారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్, మెడికల్.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
కాగా, ఏప్రిల్ 10నే దరఖాస్తు గడువు ముగియగా.. మే 2 వరకు అపరాధ రుసుముతో అవకాశం కల్పించారు. ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుముతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ. 250 నుంచి రూ. 5వేల వరకు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. రూ. 5వేలతో ఇప్పటి వరకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు.

శుక్రవారం వరకు మొత్తం 8394 మంది ఆలస్య రుసుంతో పరీక్ష రాయడానికి ముందుకొచ్చారు. శుక్రవారానికి మొత్తం 3,19,947 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్ కో-కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.వీరిలో ఇంజినీరింగ్‌కు 1,53,676ల దరఖాస్తు అందగా.. వాటిలో 1.08 లక్షల మంది హైదరాబాద్‌లోనే పరీక్ష రాయనున్నారు.
అగ్రికల్చర్‌లోనూ 94,470ల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 63,730 మంది నగరంలోనే హాజరవనున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు పరీక్షలూ 372 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సారి ఎంసెట్‌కు దరఖాస్తులు భారీగా అందడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 130 వరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications