తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కాస్త ముందుగానే విడుదల: ఏ సమయంలోనంటే?

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(TS EAMCET) ఫలితాలు విడుదలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. గురువారం(మే 25న) ఉదయం ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాల విడుదల సమయంలో స్వల్ప మార్పులు చేశారు.

ముందుగా నిర్ణయించిన సమయం కన్నా ముందే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ముందుగా ప్రకటించినట్లు గురువారం ఉదయం 11 గంటలకు బదులుగా.. రేపు ఉదయం 9.30 గంటలకే ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారని తాజాగా ప్రకటించారు. అనివార్య పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ బీ. డీన్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Telangana eamcet 2023 results to be released by minister sabitha-indra reddy on may 25th at 9.30 am

విడుదల అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి హాజరుకానున్నారు. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫలితాలను ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా తెలుసుకోవ‌చ్చని తెలిపారు. ఇక మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను కూడా మే 25నే వెల్లడించ‌నున్నారు. ఎంసెట్ ఫ‌లితాల కోసం https://eamcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

కాగా, మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను ఇప్పటికే విడుదల చేశారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇక ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్‌ విభాగంలో 1,06,514 మంది హాజరైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+