తెలంగాణలో రేపట్నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు నమోదు: 80 వేలకుపై సీట్లు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 137 ప్రైవేట్ కాలేజీల్లో 80,091 సీట్లు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.
16 యూనివర్సిటీ కాలేజీల్లో4713 సీట్లు, రెండు ప్రైవేట్ వర్సిటీల్లో 1302 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అత్యధికంగా సీఎస్ఈలో 15,897, ఈసీఈలో 9734 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. జూన్ 28 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది.

కాగా, డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సులను రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకొస్తూ తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా ఫీజులను ఏఎఫ్ఆర్సీ ఖరారు చేయనుంది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్ఆర్సీ పరిధిలోకి తేవాలని సాంకేతిక విద్యాశాఖ గత ఏడాది ప్రతిపాదించింది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు విద్యాశాఖ జీవో నెంబర్ 41 జారీ చేసింది.
టీఎస్‌పీఎస్సీ హార్టికల్చర్ ఆపీసర్ రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల
తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి జూన్ 17న నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రేపట్నుంచి జులై 1 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ఆన్‌లైన్‌లో ఇంగ్లీషులో మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. జులై 26 వరకు రెస్పాన్స్ షీట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయని పేర్కొంది. మాస్టర్ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications