తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల.. టాపర్ ఎవరో తెలిస్తే షాక్

విద్యార్థులకు అలెర్ట్. తెలంగాణ EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్‌ సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్.. తన నివాసంలో ఫలితాలు విడుదల చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్‌ సెట్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక విద్యార్థులు ఎప్‌ సెట్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఎప్‌ సెట్‌ పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో, మే 2, 3, 4 తేదీల్లో జరిగాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రాన్స్ పరీక్షను నిర్వహించారు. మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. JNTU ఆధ్వర్యంలో ఎప్ సెట్ పరీక్షలు జరిగాయి. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఈఏపీ సెట్‌ పరీక్షలకు హాజరు అయినట్లు సమాచారం.

Telangana EAPCET Results 2025 Declared Here s How to Check

ఇంజినీరింగ్ విభాగంలో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీ పురానికి చెందిన పల్లా భరత్ చంద్ర 150.058 మార్కులతో రాష్ట్ర టాపర్ గా నిలిచాడు. ఆదివాసీల జిల్లా నుంచి వచ్చిన విద్యార్థి తెలంగాణ టాపర్ గా నిలవడంతో అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లికి చెందిన ఉడగండ్ల రామ చరణ్ రెడ్డి 148.284 మార్కులతో రెండో స్థానంలో నిలిచాడు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ 147.085 మార్కులతో మూడో ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ నాచారంకు చెందిన లక్ష్మీ భార్గవ్ మెండే నాలుగో ర్యాంకు, శేరిలింగంపల్లికి చెందిన మంత్రిరెడ్డి వెంకట గణేశ్ రాయల్ ఐదో ర్యాంకు సాధించాడు.

ఇక అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్ కు చెందిన సాకేత్ రెడ్డి పెద్దక్కగారి 141.688 మార్కులతో తొలి స్థానం సాధించాడు. కరీంనగర్ లోని వావిళ్ల రామ్ రెడ్డి నగర్ కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యా 140.477 మార్కులతో రెండో ర్యాంక్ సాధించాడు. వరంగల్ కు చెందిన చంద్ర అక్షిత్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన పెద్దింటి రచ్చల సాయినంద్ కు నాలుగో ర్యాంకు వచ్చింది. మాదాపుర్ కు చెందిన బ్రాహ్మణి రెండ్లకు ఐదో ర్యాంకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+